Tuesday, 3 November 2020

Do Not Worry || Matt 6:25-34

MSNR Colony

Word 7 Pages 


Matt 6:25-34. Do Not Worry

25 “Therefore I say to you, do not worry about your life, what you will eat or what you will drink; nor about your body, what you will put on. Is not life more than food and the body more than clothing? 

25. అందువలన నేను మీతో చెప్పునదేమనగా 

ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను

ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి;

[Luke 12:23 For life is more than food, and the body more than clothes. ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?]

Phil 4:6 Be anxious for nothing, but in everything by prayer and supplication, with thanksgiving, let your requests be made known to God; దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.

John 6:5-11 Jesus fed 5000 ppl 2 fish 5 loafs bread

Jesus then took the loaves, gave thanks, and distributed to those who were seated as much as they wanted.

యేసు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;

John 11:38-44 Jesus raising Lazarus

...Jesus looked up and said, “Father, I thank you that you have heard me...యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

1Tim 6:6 Now godliness with contentment is great gain.

1Tim 6:8 And having food and clothing, with these we shall be content.

6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.౹ 7-8 మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములుగలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.౹

1Pet 5:7 casting all your care upon Him, for He cares for you. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.

Ps 55: 22. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.

26 Look at the birds of the air, for they neither sow nor reap nor gather into barns; yet your heavenly Father feeds them. Are you not of more value than they?

26. ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?

Job 38:41 Who provides food for the raven, When its young ones cry to God, And wander about for lack of food? తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?

27 Which of you by worrying can add one cubit to his stature?

27. మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?

======

28 “So why do you worry about clothing? Consider the lilies of the field, how they grow: they neither toil nor spin; 29 and yet I say to you that even Solomon in all his glory was not arrayed like one of these.

28. వస్త్రములను గూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు 29. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.

30 Now if God so clothes the grass of the field, which today is, and tomorrow is thrown into the oven, will He not much more clothe you, O you of little faith?

30. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.

Matt 14:31 And immediately Jesus stretched out His hand and caught him (Peter), and said to him, “O you of little faith, why did you doubt?” వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.

Matt 16:8 But Jesus, being aware of it, said to them, “O you of little faith, why do you reason among yourselves because you have brought no bread?

8 యేసు అది యెరిగి–అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?

31 “Therefore do not worry, saying, ‘What shall we eat?’ or ‘What shall we drink?’ or ‘What shall we wear?’ 32 For after all these things the Gentiles seek.

31. కాబట్టి ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, యేమి ధరించు కొందుమో, అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.

For your heavenly Father knows that you need all these things.

32. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.

Matt 6:8...your Father knows what you need before you ask him. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును

Luke 12:30 For the pagan world runs after all such things, and your Father knows that you need them. … ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును.


========= Ps 78 ========

Ps 78

 

12-16

12 Marvelous things He did in the sight of their fathers,

In the land of Egypt, in the field of Zoan.

13 He divided the sea and caused them to pass through;

And He made the waters stand up like a heap.

14 In the daytime also He led them with the cloud,

And all the night with a light of fire.

15 He split the rocks in the wilderness,

And gave them drink in abundance like the depths.

16 He also brought streams out of the rock,

And caused waters to run down like rivers.

12. ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.

13. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను

14. పగటివేళ మేఘములోనుండియు, రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు, ఆయన వారికి త్రోవ చూపెను

15. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.

16. బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.

...

23-25

23 Yet He had commanded the clouds above,

And opened the doors of heaven,

24 Had rained down manna on them to eat,

And given them of the [e]bread of heaven.

25 Men ate angels’ food;

He sent them food to [f]the full.

23. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞా పించెను. అంతరిక్షద్వారములను తెరచెను

24. ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను, ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను.

25. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.

...

26-29

26 He caused an east wind to blow in the heavens;

And by His power He brought in the south wind.

27 He also rained meat on them like the dust,

Feathered fowl like the sand of the seas;

28 And He let them fall in the midst of their camp,

All around their dwellings.

29 So they ate and were well filled,

For He gave them their own desire.

26. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.

27. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.

28. వారి దండు మధ్యను, వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.

29. వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.

=========================================

 

17-20

17 But they sinned even more against Him

By rebelling against the Most High in the wilderness.

18 And they tested God in their heart

By asking for the food of their fancy.

19 Yes, they spoke against God:

They said, “Can God prepare a table in the wilderness?

20 Behold, He struck the rock,

So that the waters gushed out,

And the streams overflowed.

Can He give bread also?

Can He provide meat for His people?”

17. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపముచేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.

18. వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు, తమ హృదయములలో దేవుని శోధించిరి.

19. అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచ గలడా యనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి.

20. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి.

Jeremiah 32:27 “Behold, I am the Lord, the God of all flesh. Is anything too hard for me? నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?

Genesis 18:14 Is anything too hard for the Lord? At the appointed time I will return to you, about this time next year, and Sarah shall have a son.” 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.

Matt 19:26 (The Rich and the Kingdom of God) Jesus looked at them and said, “With man this is impossible, but with God all things are possible. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను.

...

41-52

41 Yes, again and again they tempted God, And limited the Holy One of Israel.

42 They did not remember His [i]power: The day when He redeemed them from the enemy,

43 When He worked His signs in Egypt, And His wonders in the field of Zoan;

44 Turned their rivers into blood, And their streams, that they could not drink.

45 He sent swarms of flies among them, which devoured them, And frogs, which destroyed them.

46 He also gave their crops to the caterpillar, And their labor to the locust.

47 He destroyed their vines with hail, And their sycamore trees with frost.

48 He also gave up their cattle to the hail, And their flocks to fiery [j]lightning.

49 He cast on them the fierceness of His anger, Wrath, indignation, and trouble, By sending angels of destruction among them.

50 He made a path for His anger; He did not spare their soul from death, But gave [k]their life over to the plague,

51 And destroyed all the firstborn in Egypt, The first of their strength in the tents of Ham.

52 But He made His own people go forth like sheep, And guided them in the wilderness like a flock;

41. మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.

42. ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.

43. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.

44. ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను

45. ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.

46. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను, వారి కష్టఫలములను మిడతలకప్పగించెను.

47. వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను, హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేసెను.

48. వారి పశువులను వడగండ్ల పాలుచేసెను. వారి మందలను పిడుగుల పాలుచేసెను.

49. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను.

50. తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను.

51. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను.

52. అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను, ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను

========= Ps 78 ========


33 But seek first the kingdom of God and His righteousness, and all these things shall be added to you.

33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.

Ps 37:4 Take delight in the Lord, and he will give you the desires of your heart. యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.

Ps 37:25 I was young and now I am old, yet I have never seen the righteous forsaken or their children begging bread. నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.

Gen 15:6 Abram believed the LORD, and he credited it to him as righteousness. అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.

Romans 4:20 (abraham and sarah at old age having a child) Yet he did not waver through disbelief in the promise of God, but was strengthened in his faith and gave glory to God,

20. అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక 21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. 22. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

Galatians 3:6 So also, "Abraham believed God, and it was credited to him as righteousness."

6 అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను.౹ 

James 2:23 And the Scripture was fulfilled that says, "Abraham believed God, and it was credited to him as righteousness," and he was called a friend of God.

23 కాబట్టి –అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను - అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితు డని అతనికి పేరుకలిగెను.౹ 

34 Therefore do not worry about tomorrow, for tomorrow will worry about its own things. Sufficient for the day is its own trouble.

34. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.

Ex 16:4 Then the Lord said to Moses, “I will rain down bread from heaven for you. The people are to go out each day and gather enough for that day. In this way I will test them and see whether they will follow my instructions.

యెహోవా మోషేను చూచి-ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.

 

 

George Muller missionary

 

Phil 4:6 Be anxious for nothing, but in everything by prayer and supplication, with thanksgiving, let your requests be made known to God; దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.

 

1Pet 5:7 casting all your care upon Him, for He cares for you. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.

 

Ps 55: 22. నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.

 

....వారు స్మరణకు తెచ్చుకొనలేదు.

....వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.

No comments:

Post a Comment