Thursday 4 January 2018

Hebrews 10 - Telugu Sermon Points

1 The law is only a shadow of the good things that are coming—not the realities themselves. 
1 ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగల . దియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు

For this reason it can never, by the same sacrifices repeated endlessly year after year, make perfect those who draw near to worship. 

గనుక ఆయాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు.౹

2 Otherwise, would they not have stopped being offered? 

For the worshipers would have been cleansed once for all, and would no longer have felt guilty for their sins. 
2 ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞిప్త ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా.౹

3 But those sacrifices are an annual reminder of sins. 

3 అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి౹

4 It is impossible for the blood of bulls and goats to take away sins.

4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.౹


==========

5 Therefore, when Christ came into the world, he said: 
“Sacrifice and offering you did not desire, but a body you prepared for me;
5 కాబట్టి ఆయన (Christ) ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.
–బలియు అర్పణయు నీవు కోరలేదుగాని, నాకొక శరీరమును అమర్చితివి.

6 with burnt offerings and sin offerings you were not pleased.
6 పూర్ణహోమములును, పాపపరిహారార్థబలులును నీకిష్టమైనవికావు.

7 Then I said, ‘Here I am—it is written about me in the scroll— I have come to do your will, my God.’” [Psalm 40:6-8]
7 అప్పుడు నేను–గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.

[ Psalm 40:6-8. God Sustains His Servant: 6 Sacrifice and meal offering You do not desire, nor do You delight in them;
You have opened my ears and given me the capacity to hear [and obey Your word]; 
Burnt offerings and sin offerings You do not require.
7 Then I said, “Behold, I come [to the throne]; In the scroll of the book it is written of me.
8 “I delight to do Your will, O my God; Your law is within my heart.” - Psalm 40:6-8.

6 బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు.
దహనబలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు.
7 అప్పుడు–పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను.
8 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. ]

8 First he said, “Sacrifices and offerings, burnt offerings and sin offerings you did not desire, nor were you pleased with them”—though they were offered in accordance with the law. 
9 Then he said, “Here I am, I have come to do your will.” 
He sets aside the first to establish the second. 
8–బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత౹ 9 ఆయన–నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పు చున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.౹

10 And by that will, we have been made holy through the sacrifice of the body of Jesus Christ once for all.
10 యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమునుబట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.౹

==========

11 Day after day every priest stands and performs his religious duties; again and again he offers the same sacrifices, which can never take away sins. 
11 మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.౹

12 But when this priest had offered for all time one sacrifice for sins, he sat down at the right hand of God, 13 and since that time he waits for his enemies to be made his footstool. 
12-13 ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడువరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీను డాయెను.౹

Psalm 110:1 The Lord Gives Dominion to the King / The Lord and His Chosen King (A psalm by David)
The Lord (Father) says to my Lord (the Messiah, His Son),
“Sit at My right hand Until I make Your enemies a footstool for Your feet [subjugating them into complete submission].”
దావీదు కీర్తన. - 1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు –నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ]

14 For by one sacrifice he has made perfect forever those who are being made holy.
14 ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.౹

15 The Holy Spirit also testifies to us about this. First he says:
15 ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడ మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు.౹

16 “This is the covenant I will make with them after that time, says the Lord.
I will put my laws in their hearts, and I will write them on their minds.” [Jer. 31:33]
16 ఏలాగనగా – ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే–నా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత

[ Jer. 31:31-32.
31 “The days are coming,” declares the Lord, “when I will make a new covenant with the people of Israel and with the people of Judah.
32 It will not be like the covenant I made with their ancestors when I took them by the hand to lead them out of Egypt, because they broke my covenant, though I was a husband to them,[Or was their master]”
declares the Lord.

31–ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధనచేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.౹ 32 అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.౹ 


Hebrews 8:8-12. A New Covenant / The High Priest of a New Covenant
8  But God found fault with the people and said : “The days are coming, declares the Lord, when I will make a new covenant with the people of Israel and with the people of Judah.   9  It will not be like the covenant I made with their ancestors when I took them by the hand to lead them out of Egypt, because they did not remain faithful to my covenant, and I turned away from them, declares the Lord.   10  This is the covenant I will establish with the people of Israel after that time, declares the Lord. I will put my laws in their minds and write them on their hearts. I will be their God, and they will be my people.   11  No longer will they teach their neighbor, or say to one another, ‘Know the Lord,’ because they will all know me, from the least of them to the greatest.   12  For I will forgive their wickedness and will remember their sins no more.” 

8 అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు –ప్రభువు ఇట్లనెను–ఇదిగో యొక కాలమువచ్చుచున్నది.
అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను, యూదా ఇంటివారితోను, నేను క్రొత్తనిబంధన చేయుదును.
9 అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు.
ఏమనగా–వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు.
10 ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయములమీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడునై యుందును, వారు నాకు ప్రజలైయుందురు.వారిలో ఎవడును
11–ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలవరకు అందరును నన్ను తెలిసికొందురు.
12 నేను వారి దోషముల విషయమై దయగలిగివారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ]

[  Jer. 31:33. Israel’s Mourning Turned to Joy: “But this is the covenant which I will make with the house of Israel after those days,” says the Lord, “I will put My law within them, and I will write it on their hearts; and I will be their God, and they will be My people.

33 ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.౹  ]

17 Then he adds: “Their sins and lawless acts I will remember no more.” [Jer. 31:34]
17–వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.

[ Jer. 31:34. Israel’s Mourning Turned to Joy : And each man will no longer teach his neighbor and his brother, saying, ‘Know the Lord,’ for they will all know Me [through personal experience], from the least of them to the greatest,” says the Lord. “For I will forgive their wickedness, and I will no longer remember their sin.” - Jer. 31:34

34 నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డును–యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.౹  ]

18 And where these have been forgiven, sacrifice for sin is no longer necessary.
18 వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు.

==========

19 Therefore, brothers and sisters, since we have confidence to enter the Most Holy Place by the blood of Jesus, 
20 by a new and living way opened for us through the curtain, that is, his body,
21 and since we have a great priest over the house of God, 
22 let us draw near to God with a sincere heart and with the full assurance that faith brings, having our hearts sprinkled to cleanse us from a guilty conscience and having our bodies washed with pure water. 
19-20 సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,౹ 21 దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,౹ 22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములుగలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములుగలవారమునైయుండి, విశ్వాసవిషయములో (10:22 లేక, విశ్వాసముయొక్క. ) సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.౹ 

23 Let us hold unswervingly to the hope we profess, for he who promised is faithful. 

23 వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.౹


==========

24 And let us consider how we may spur one another on toward love and good deeds,

25 not giving up meeting together, as some are in the habit of doing, but encouraging one another—and all the more as you see the Day approaching.

24-25 కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని (10:24-25 మూలభాషలో–రేపవలెనని.)  ఆలోచింతము.


==========

26 If we deliberately keep on sinning after we have received the knowledge of the truth, no sacrifice for sins is left, 
26 మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని౹

27 but only a fearful expectation of judgment and of raging fire that will consume the enemies of God. 
27 న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.౹

==========

28 Anyone who rejected the law of Moses died without mercy on the testimony of two or three witnesses. 
28 ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు.౹

29 How much more severely do you think someone deserves to be punished 
  • who has trampled the Son of God underfoot, 
  • who has treated as an unholy thing the blood of the covenant that sanctified them, 
  • and who has insulted the Spirit of grace? 
29 ఇట్లుండగా దేవుని కుమారుని, 
  • పాదములతో త్రొక్కి, 
  • తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, 
  • కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు 
ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?

==========

30 For we know him who said, “It is mine to avenge; I will repay,” [Deut 32:35] and again, “The Lord will judge his people.”[Deut 32:36, Psalm 135:14]. 
30 –పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు
మరియు –ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.౹

[ Deut 32:35. The Song of Moses
‘Vengeance is Mine, and retribution, In due time their foot will slip; For the day of their disaster is at hand, And their doom hurries to meet them.’
35 వారి ఆపద్దినము సమీపించునువారి గతి త్వరగా వచ్చును.

Deut.32:36 “For the Lord will vindicate His people, And will have compassion on His servants, When He sees that their strength (hand) is gone, And none remains, whether bond or free.

36 వారి కాధారము లేకపోవును.

Psalm 135:14. For the Lord will judge His people And He will have compassion on His servants [revealing His mercy].

14 యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును. ]

31 It is a dreadful thing to fall into the hands of the living God.*

31 జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.

==========

32 Remember those earlier days after you had received the light, when you endured in a great conflict full of suffering.
32 అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతోకూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.౹

33 Sometimes you were publicly exposed to insult and persecution; at other times you stood side by side with those who were so treated.
34 You suffered along with those in prison and joyfully accepted the confiscation of your property, because you knew that you yourselves had better and lasting possessions.
33 ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభ వించినవారితో పాలివారలైతిరి.౹ 34 ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేప్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.౹

35 So do not throw away your confidence; it will be richly rewarded.
35 కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.౹

36 You need to persevere so that when you have done the will of God, you will receive what he has promised.
36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.

37 For, “In just a little while, he who is coming will come and will not delay.” [Isaiah 26:20; Hab. 2:3]
37–ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.౹

[ Isaiah 26:20. A Song of Praise / God Will Give His People Victory > Judgment and Restoration: 
Go, my people, enter your rooms and shut the doors behind you;
hide yourselves for a little while until his wrath has passed by.
20నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసులను శిక్షించుటకు
యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చుచున్నాడు
భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

Hab. 2:3. The Lord's Answer to Habakkuk.

For the revelation awaits an appointed time; it speaks of the end and will not prove false.
Though it linger, wait for it; it[Though he linger, wait for him;/he] will certainly come and will not delay.
3 ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.౹ ]

38 And, “But my righteous [Some early manuscripts But the righteous] one will live by faith. And I take no pleasure in the one who shrinks back.”[Hab 2:4]
38 నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసినయెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.

[ Hab. 2:4. The Lord's Answer to Habakkuk.
 “See, the enemy is puffed up; his desires are not upright— but the righteous person will live by his faithfulness [Or faith] —
4 వారు యథార్థపరులుకాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ (2:4 లేక, తన విశ్వాస్యతచేత.) బ్రదుకును.౹ ]

39 But we do not belong to those who shrink back and are destroyed, but to those who have faith and are saved.

39 అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు (10:39 లేక, సంపాదించుకొనుటకు.)  విశ్వాసము కలిగినవారమై యున్నాము.


No comments:

Post a Comment